హిందూపురంలో యువ వైద్యురాలు ఆత్మహత్య

Young Doctor Commits Suicide In Anantapur District - Sakshi

హిందూపురం(అనంతపురం జిల్లా): తీవ్రమైన మానసిక ఒత్తిడిని తాళలేక ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్‌ (వైఎస్సార్‌సీపీ) మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) ఇటీవల కర్నూలులోని మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. బెంగళూరులో పీజీ కోర్సు పూర్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది.
చదవండి: రూ.25 లక్షల కట్నం.. రూ.50లక్షలతో ఘనంగా పెళ్లి.. అయినా సరిపోలే!

ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె సోమవారం ఉదయం ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఫోన్‌ ద్వారా మల్లికార్జునను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు బాధితకుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top