నకిలీ హాల్‌ టికెట్‌తో సివిల్స్‌ పరీక్షకు..  | Women Attends Civil Exame With Fake Hallticket In Hyderabad | Sakshi
Sakshi News home page

నకిలీ హాల్‌ టికెట్‌తో సివిల్స్‌ పరీక్షకు.. 

Jan 9 2021 12:28 PM | Updated on Jan 9 2021 12:32 PM

Women Attends Civil Exame With Fake Hallticket In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూపీఎస్సీ సివిల్‌సర్వీసెస్‌(మెయిన్స్‌) పరీక్షలకు శుక్రవారం ఓ యువతి నకిలీ హాల్‌టికెట్‌తో రావడాన్ని అధికారులు గుర్తించారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన యువతి బజార్‌ఘాట్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రంలో హాల్‌టికెట్‌(నెంబర్‌ 7601738) పరీక్షకు హాజరయ్యింది. హాల్‌ టికెట్‌ను పరిశీలించిన చీఫ్‌ అబ్జర్వర్‌ నకిలీదిగా గుర్తించారు. దీనిపై విచారణ  జరిపిన అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా  పౌరసంబంధాల అధికారి పేర్కొన్నారు.  

        

Advertisement
 
Advertisement
Advertisement