వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..

Woman Left Her Child Railway Station Over Extramarital Affair Karnataka - Sakshi

మైసూరు(బెంగళూరు): ఇటీవల రాయచూరు బస్టాండులో ఒక యువకుని చేతికి ఒక మహిళ చిన్నారి కొడుకును ఇచ్చి, ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు సొంతూరు మైసూరుకు వచ్చి ఆ బిడ్డను పోలీసులకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇదేమిటని మైసూరులోని లష్కర్‌– రాయచూరు పోలీసులు దర్యాప్తు జరిపితే క్రైం స్టోరీ బయటపడింది. ఆ బిడ్డను అప్పజెప్పిన యువకుడు, ఆ మహిళ ఇందులో సూత్రధారులని అని తేలింది.  

ఇన్‌స్టా పరిచయంతో  
వివరాలు.. మైసూరు జిల్లా హెచ్‌డి కోటెకు చెందిన రఘు అనే యువకునికి రాయచూరుకు చెందిన వివాహితతో ఇన్‌స్టా గ్రాంలో పరిచయమైంది. ఆమెకు చిన్నారి కొడుకు, భర్త ఉన్నారు. అయినప్పటికీ  ఏడాదిన్నరగా రఘు– ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి అక్రమ సంబంధం మహిళ భర్త యేసురాజుకు తెలిసి ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. బిడ్డను వదిలించుకుంటే ఇంక ఏ సమస్యా ఉండదని రఘు, ఆమె భావించారు. ఇందుకోసం పై విధంగా నాటకం ఆడారు. రాయచూరు నుంచి బిడ్డను తీసుకొచ్చి ఎవరో మహిళ ఇచ్చి వెళ్లిందని పోలీసులకు అప్పజెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు బాలున్ని శిశుగృహకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మహిళ భర్తను పిలిచి విచారించగా విషయం బయపడింది. ఆ జంటపై కేసు నమోదు చేశారు.

చదవండి: ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్‌తో బెదిరించి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top