బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..

Woman Filed Case On Husband For Hiding His Bald Head - Sakshi

ముంబై : బట్టతల ఉందన్న సంగతి దాచిపెట్టి, భర్త తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందో భార్య. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మీరా రోడ్‌కు చెందిన 29 ఏళ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌కు గత నెలలో పెళ్లయింది.  పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత సదరు అకౌంటెంట్‌కు బట్టతల ఉందని అతడి భార్య గుర్తించింది. దీంతో తను మోసపోయానని భావించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. ( స్నేహితుని భార్యపై లైంగిక దాడి..)

పెళ్లికి ముందు భర్త బట్టతల గురించి తనకు చెప్పలేదని, విగ్గు పెట్టుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని, భర్త లేనిపోని అనుమానాలతో తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి కాల్‌ రికార్డులు, చాటింగ్‌ విషయాలు చెక్‌ చేస్తున్నాడని తెలిపింది. సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top