Guntur District: Woman Died After Eat Umbilical Cord To Get Pregnant - Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత..

Dec 19 2021 4:12 PM | Updated on Dec 19 2021 4:58 PM

Woman Died After Eat Umbilical Cord To Get Pregnant In Guntur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బొడ్డుపేగు తింటే పిల్లలు పుడతారనే మూఢ నమ్మకానికి ఓ వివాహిత బలైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు..

నాదెండ్ల: బొడ్డుపేగు తింటే పిల్లలు పుడతారనే మూఢ నమ్మకానికి ఓ వివాహిత బలైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 13వ తేదీన వేరే మహిళ ప్రసవించడంతో బొడ్డుపేగు తెచ్చిన కుటుంబ సభ్యులు సన్నిత చేత తినిపించారు.

చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి తీసుకెళ్లి..

రెండు రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. శనివారం సన్నిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తన కుమార్తెను అత్తింటి వారు తరచూ వేధిస్తూ ఆమె చేత విషపదార్థం తినిపించి హత్య చేశారంటూ సన్నిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement