వివాహేతర సంబంధం భర్తకు తెలిసి..

Woman Committed Suicide Jumping Into LLC Has Taken New Turn - Sakshi

వివాహేతర సంబంధమే కారణం 

నిందితులు తల్లి, భర్త, బావను అరెస్ట్‌ చేసిన పోలీసులు   

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వినోద్‌కుమార్‌ 

సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): మండల పరిధిలోని హెచ్‌.మురవణి గ్రామ పరిధిలోని ఎల్‌ఎల్‌సీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. మహిళది ఆత్మహత్య కాదని, సొంత వాళ్లే హత్య చేసి కాలువలో పడేశారని విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు గురువారం ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌ ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వివరాలను డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి భార్య ప్రభావతి (38) స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయాన్ని పసిగట్టిన వీరారెడ్డి.. భార్యను మందలించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకపోవడంతో అత్త వెంకటేశ్వరమ్మ(ప్రభావతి తల్లి), సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి గత నెల 31న ఇంట్లోనే చితకబాదారు.   (విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై...)

స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయిందని భావించి కారులో తీసుకెళ్లి ఎల్‌ఎల్‌సీలో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు. కొనఊపిరితో ఉన్న ఆమెను చుట్టపక్కల పొలాల రైతులు గమనించి బయటకు తీయగా కొద్దిసేపటికే మృతిచెందింది. అయితే వివాహేతర సంబంధం తెలిసి మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తలపై రక్త గాయాలు ఉన్నందున అనుమానంతో ఆ దిశగా విచారణ చేపట్టగా హత్య కేసు వెలుగు చూసింది. తాము దొరికిపోతామని భావించిన నిందితులు గురువారం హెచ్‌.మురవణి వీఆర్‌ఓ సురేష్‌ ఎదుట హాజరై నేరం చేసినట్లు అంగీకరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్పు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top