చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి | Woman Cheating On Young Man at Karnataka | Sakshi
Sakshi News home page

చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి

Oct 18 2022 8:23 AM | Updated on Oct 18 2022 8:23 AM

Woman Cheating On Young Man at Karnataka - Sakshi

బనశంకరి: బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న గూగుల్‌ టెక్కీ, ఓ యువతితో స్నేహం చేసి ఆమె కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయిన ఘటన చోటు చేసుకుంది. గూగుల్‌ ఇండియా సీనియర్‌ మేనేజర్, మధ్యప్రదేశ్‌ భోపాల్‌కు చెందిన గణేశ్‌ శంకర్,  షిల్లాంగ్‌ ఐఐఎంలో ఎంబీఏ చదువుతున్న సమయంలో భోపాల్‌కు చెందిన సుజాత అనే యువతి పరిచయమైంది.  ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఆ యువతిని కలవడానికి భోపాల్‌ వెళ్లిన గణేశ్‌ శంకర్‌కు ఆ యువతి కుటుంబ సభ్యులు బాగా మర్యాదలు చేశారు. అనంతరం మత్తు కలిగించే ఔషధం ఇచ్చి ఓ చీకటి గదిలో బంధించారు. ఆ తరువాత గణేశ్‌ను బెదిరించి ఆ యువతితో పెళ్లి చేసి ఫొటోలు తీశారు.

బ్లాక్‌మెయిలింగ్‌
రూ. 40 లక్షలు ఇవ్వాలని, లేదంటే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు.  ఎలాగో గణేశ్, భోపాల్‌లోని కమలానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు యువతి, కుటుంబ సభ్యులు ముగ్గురిపై (యువతి సుజాత, తండ్రి కమలేశ్‌సింగ్, సోదరుడు శైవేశ్‌సింగ్, విజేంద్రకుమార్‌)పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణేశ్‌ కూడా వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు సుజాత కుటుంబ సభ్యులు తమకు తెలిపారని, గణేశ్‌ ద్వారా తాము మోసపోయామని వారు బెంగళూరులో ఫిర్యాదు చేశారని భోపాల్‌ కమలానగర పోలీస్‌ అధికారి అనిల్‌కుమార్‌ వాజ్‌పేయి తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement