పిల్లల్ని బాగా చూసుకో..  | Sakshi
Sakshi News home page

పిల్లల్ని బాగా చూసుకో.. 

Published Wed, Aug 17 2022 8:23 AM

Wife Commits Suside Take Care Of Children Saying In Letter - Sakshi

కుత్బుల్లాపూర్‌: నాకు బతకాలని లేదు.. నా భర్త మంచోడు.. ఇంకో పెళ్లి చేసుకో..పిల్లలని బాగా చూసుకో.. అంటూ ఓ మహిళ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిజిల్లా, మందపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీను, దేవి (32) దంపతులు నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్‌ ఫేస్‌–2 సంజీవయ్యనగర్‌లో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీను  ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా, దేవి  షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా పని చేసేది.  మంగళవారం  షాపింగ్‌ మాల్‌లో పనికి వెళ్లిన దేవి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచి్చంది. ఇంట్లో ఉన్న భర్తతో తనకు కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో అతను మందులు తెచ్చి ఇచ్చి ఆటో తీసుకుని బయటికి వెళ్లాడు. సాయంత్రం  పిల్లలను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా దేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.

స్థానికుల సాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది.  ఆమె మృతదేహం పక్కనే సూసైడ్‌ లెటర్‌ కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పేట్‌బïÙరాబాద్‌ ఎస్‌ఐ రామకృష్ణ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

(చదవండి: ప్రేమ పేరుతో మైనర్‌ బాలికకు వంచన! )

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement