నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన భార్య | Wife Assassinates Her Husband Over Extra Marital Affair At Guntur District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై దారుణం

Mar 27 2021 11:29 AM | Updated on Mar 27 2021 2:03 PM

Wife Assassinates Her Husband Over Extra Marital Affair At Guntur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నరసరావుపేట‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ ఘటన నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంలో జరిగింది పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన మద్దమాల చెంచయ్య (42), అన్నమ్మ దంపతులు. వారికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చెంచయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. అన్నమ్మకు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవులు జరిగేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి నిద్రపోయేందుకు అన్నమ్మ తన భర్త చెంచయ్యను డాబాపైకి తీసుకెళ్లింది. చెంచయ్య గాఢనిద్రలో ఉండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అన్నమ్మ అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.

ఒక్క సారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో చెంచయ్య పెద్దగా కేకలు వేశాడు. తండ్రి అరుపులు విని ఇంటిలో నిద్రిస్తున్న అతని కుమారుడు మనో హర్, చుట్టుపక్కల హుటాహుటిన డాబాపైకి చేరి మంటలు అర్పి, తీవ్రంగా గాయపడిన చెంచయ్యను 108 అంబులెన్స్‌లో పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో చెంచయ్య మృతిచెందాడు. చెంచయ్య కుమార్తెకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. భర్తపై పెట్రోలుపోసి నిప్పటించిన అన్నమ్మ పరారీలో ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ రోశయ్య తెలిపారు.
చదవండి: ఆకు పసరు ప్రాణం తీసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement