రూమ్‌లోకి వెళ్లి మత్తు ఇంజక్షన్‌ ఎక్కించుకుని..

Vijayawada: Youth Ends His Life In Hotel - Sakshi

సాక్షి,విజయవాడ: మత్తు ఇంజక్షన్‌ ఎక్కించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజమండ్రిలోని రాజీనగరానికి చెందిన పెద్దింటి రాహుల్‌ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటినుంచి అతను తన పిన్ని వద్ద ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 31న నగరానికి వచ్చి పీఎన్‌బీఎస్‌ సమీపంలోని బాలాజీ లాడ్జిలో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు.

మంగళవారం ఉదయం లాడ్జి సిబ్బంది అతని రూమ్‌ లోకి వెళ్లి చూడగా కదలకుండా ఉండటాన్ని చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతదేహం పక్కనే మత్తు ఇంజక్షన్‌, సిరంజ్‌ లభించడంతో మత్తు ఇంజక్షన్‌ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top