ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి | Video: SUV Car Several Times After Hitting Divider In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి

Apr 10 2024 5:32 PM | Updated on Apr 10 2024 5:50 PM

Video: SUV Car Several Times After Hitting Divider In Tamil Nadu - Sakshi

చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్‌ నగర్‌-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్‌యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం  ఎడమ వైపున్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది.

దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్‌ లైన్‌లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement