లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్‌ | Vanasthalipuram: Police Raid Brothel, Arrest 4 People | Sakshi
Sakshi News home page

వనస్థలిపురం: వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురు అరెస్టు

Jun 21 2021 10:48 AM | Updated on Jun 21 2021 11:10 AM

Vanasthalipuram: Police Raid Brothel, Arrest 4 People - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వనస్థలిపురం: లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కుంటలోని మనోహర్‌ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109పై దాడి చేయగా అందులో ఓ వ్యక్తి, మహిళను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరితో పాటు ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

చదవండి: వెబ్‌సైట్‌లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం..

Advertisement
 
Advertisement
Advertisement