దారుణం: తాగడానికి నీళ్లు అడిగి.. నోట్లో గుడ్డకుక్కి.. ఆపై.. 

Unknown Women Brutally Attack On Old Lady In Medak - Sakshi

నర్సాపూర్‌(మెదక్‌): నర్సాపూర్‌లో మంగళవారం పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసిన గుర్తు తెలియని మహిళ చోరీకి పాల్పడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండు ఎదురుగా ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ(65) ఒక్కతే తన ఇంట్లో ఉంటుంది. మంగళవారం ప్రెషర్‌ కుక్కర్లు అమ్ముతామంటూ ఓ మహిళ అటుగా వచ్చి పెంటమ్మను కుక్కర్‌ తీసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరించింది. సదరు మహిళ తాగడానికి నీళ్లు ఇవ్వాలని అడగడంతో పెంటమ్మ ఇంట్లోకి వెళ్లగా ఆమె వెనకాల మహిళ వెల్లి తలుపులకు గడియపెట్టి పెంటమ్మ నోట్లో గుడ్డకుక్కి అక్కడే ఉన్న కర్రతో దాడిచేసింది.

అనంతరం పెంటమ్మ మెడలో ఉన్న సుమారు తులం బంగారు గుండ్లు, చేతులకు ఉన్న వెండి గాజులు తీసుకుని పారిపోయింది. ఆమె వెళ్లిన కొంత సేపటికి పెంటమ్మ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు చెప్పారు. తీవ్రంగా గాయపడిన పెంటమ్మను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు.

చదవండి:  తల్లిని వేధిస్తున్నందుకు.. తండ్రిని చంపిన తనయుడు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top