దారుణం: మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన మేనమామ

Uncle Who Assassinationed Three Year Old Child - Sakshi

సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ గొంతు కోసి హత్య చేశాడు. గత అర్ధరాత్రి మూడేళ్ల చిన్నారి కిల్లక భవ్యశ్రీ నిద్రిస్తున్న సమయంలో మేనమామ వినోద్‌ కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు వినోద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని..
స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top