ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ 

Thugs Make Blast at ATM In Pune, Flee With Rs 28 Lakh - Sakshi

సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్‌ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది.

ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ  తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top