
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై లారీని ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బల్లికురవ మండలం అలనడక వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.