
పరారైన రాజు
బయ్యారం: పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయిన దొంగను పట్టిస్తే రూ.10 వేలు బహుమతి ఇస్తామంటూ బయ్యారం పోలీసుల పేరుతో సోషల్‌మీడియాలో వచ్చిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. గంధంపల్లిలో ఇటీవల పట్టపగలు జరిగిన చోరీపై ఖమ్మం జిల్లా మాదారం గ్రామానికి చెందిన పూనెం రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో ఉంచారు.
ఆదివారం రాత్రి రాజు పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం రహస్యంగా గాలింపు ప్రారంభించారు. తర్వాత రాజును పట్టిస్తే రూ.10 వేల బహుమతి ఇస్తామని ‘బయ్యారం పోలీస్’ పేరుతో ఓ కానిస్టేబుల్‌కు చెందిన మొబైల్ వాట్సాప్ ద్వారా సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనిపై పోలీస్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.