స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు | Tension In Shivamogga Both Stabbed At Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు

Aug 16 2022 10:43 AM | Updated on Aug 16 2022 1:10 PM

Tension In Shivamogga Both Stabbed At Independence Day Celebrations - Sakshi

శివమొగ్గ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శివమొగ్గ నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమరయోధుడు సావర్కర్‌ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేశారు. సోమవారం ఇక్కడి హమీద్‌ అహ్మద్‌ సర్కిల్‌ వద్ద వీర సావర్కర్‌ ఫ్లెక్సీతో సావర్కర్‌ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించగా కొందరు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు.

ఇదే సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని సావర్కర్‌ ఫ్లెక్సీని తొలగించాలని యత్నించారు. దాని స్థానంలో టిప్పు సుల్తాన్‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తుండగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో హిందూ పోరాట సంఘాలు అక్కడి చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది.

సర్కిల్‌కు సమీపంలో ప్రేమ్‌సింగ్, ప్రవీణ్‌ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. 

(చదవండి: జెండా పండుగలో విషాదం)

Advertisement
 
Advertisement
Advertisement