వామ్మో.. ఎంత డబ్బో...

Telangana ACB Officials Open Kamareddy CI Jagadish Locker - Sakshi

సీఐ జగదీశ్‌ లాకర్‌లో కళ్లు చెదిరే నగదు

రూ. 34 లక్షల నగదు.. భారీగా బంగారం స్వాధీనం

సాక్షి, నిజామాబాద్ : క్రికెట్‌ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కామారెడ్డి సీఐ జగదీశ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కంటేశ్వర్‌ యాక్సిస్‌ బ్యాంకులో జగదీశ్‌కి సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి.. 34,40,000 రూపాయల నగదుతో పాటు 9 లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను సీజ్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావుతెలిపారు. సస్పెండైన సీఐ జగదీశ్‌కు సంబంధించి అక్రమాస్తులను గుర్తించే పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున జగదీష్ భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కామారెడ్డి సీఐ జగదీశ్‌ అరెస్టు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top