కొంతకాలంగా యువతితో ప్రేమ.. స్నేహితులతో కలిసి ప్రియుడు..

Teenage Girl Suicide Over Molested Boy Friend Orissa - Sakshi

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): విషం తాగి బబిత హంతాల్‌(17) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి సమితి, పెద్దవాడ పంచాయతీ, బప్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈ యువతి, మత్తిలి సమితి, పూరణగుడకు చెందిన గుప్త బారల్‌ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం ఉదయం ఇంట్లో వాళ్లకు చెప్పి, ప్రియుడి ఇంటికి బబిత వెళ్లింది.

అయితే అక్కడ ప్రియుడు తన స్నేహితులతో కలిసి, బబితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రియుడి ఇంట్లోనే విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతిని చికిత్స నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యసేవల కోసం  మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి యువతిని తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతుండగా యువతి మృతి చెందడం విచారకరం. ఈ ఘటనపై కన్నీరుమున్నీరు అయిన యువతి తల్లిదండ్రులు మల్కన్‌గిరి పోలీసులను ఆశ్రయించి, న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top