Shocking: Software Psycho Father Commits Suicide After Brutally Killed His Wife And Childrens - Sakshi
Sakshi News home page

Tamilnadu Crime: దారుణం: ఆన్‌లైన్‌లో రంపం కొని.. భార్యా పిల్లల్ని కిరాతకంగా..

May 28 2022 3:59 PM | Updated on May 28 2022 6:23 PM

Tamilnadu: Psycho Father Suicide After Assassinated Wife Childrens - Sakshi

చెన్నై: కన్నతండ్రి కసాయిగా మారాడు. ముక్కుపచ్చలారని కొడుకు కూతుర్ని, భార్యను ఎలక్ట్రిక్ రంపం మిషన్‌తో అతి దారుణంగా హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సైకో సాప్ట్ వేర్ తండ్రి. అసలు ఇంతటి దారుణానికి పాల్పడడానికి కారణాలేంటి..అప్పులు భాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. చెన్నై పల్లవరం పక్కనే పొజిచలూరులో ప్రకాష్ (41) అతని భార్య గాయత్రి (39), కుమార్తె నిత్యశ్రీ (13), కుమారుడు హరి కృష్ణన్ (8)లను అతి కిరాతకంగా ఎలక్ట్రిక్ రంపపు మిషన్‌తో వారిని చంపి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ తండ్రి ఉదయం ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న కుటుంబాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిలంచాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. శంకర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకును క్లూస్ టీమ్కు సమాచారం అందించారు. చనిపోయే ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులకు లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు,  దానిని పరిశోధించి, క్రెడిట్ వేధింపులు లేదా బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఇంట్లో 3.50 లక్షల బాండ్ అందిందని, దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

చదవండి: రథోత్సవంలో అపశ్రుతి.. రథానికి కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement