మాజీ డీఎస్పీ ఇంట్లో చోరీ.. బంగారం, డబ్బు మాయం | Tamil Nadu: Theft In Retired DSP Home Case Filed | Sakshi
Sakshi News home page

మాజీ డీఎస్పీ ఇంట్లో చోరీ.. బంగారం, డబ్బు మాయం

Jun 16 2021 2:02 PM | Updated on Jun 16 2021 2:23 PM

Tamil Nadu: Theft In Retired DSP Home Case Filed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: రిటైర్డ్‌ డీఎస్పీ ఇంట్లో చోరీ జరిగింది. తేని సమీపంలోని కొడువిళార్‌పట్టికి చెందిన రిటైర్డ్‌ డీఎస్పీ భారతి (72). భార్య జ్యోతిమణి. సోమవారం ఉదయం దంపతులు లేచి చూడగా ఇంటి కిటికీ కమ్ములు తొలగించి ఉంది. గదిలోకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 22 సవర్ల నగలు, రూ. 50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. భారతి ఫిర్యాదు మేరకు తేని ఎస్పీ డోంగ్రే, పళనిశెట్టిపల్లి పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. పోలీసు జాగిలం భారతి ఇంటి నుంచి కొడువిలార్‌పట్టి టాస్మాక్‌ షాపు వద్దకు వెళ్లి ఆగింది. పళనిశెట్టిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

యువకుడి హత్య 
తిరువొత్తియూరు: మద్యం తాగుతున్న సమయంలో ఏర్పడిన గొడవ యువకుడి ప్రాణం తీసింది. వివరాలు.. చెన్నై ఆవడి, పట్టాభిరాంకు చెందిన ప్రశాంత్‌ (24) తన స్నేహితుడు నాగరాజ్‌తో కలిసి సోమవారం సాయంత్రం గాంధీనగర్‌ వద్దనున్న చెరువుగట్టు వద్ద మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో అక్కడ మద్యం తాగుతున్న ముఠాతో వాగ్వాదం ఏర్పడింది. దీంతో ముఠాలోని ఆరుగురు ప్రశాంత్, నాగరాజ్‌లపై దాడి చేశారు. నాగరాజ్‌ పారిపోయాడు. ప్రశాంత్‌పై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement