సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు | Sri Sudha Complaint To ACB Against SR Nagar CI For Demanding Money | Sakshi
Sakshi News home page

సీఐ మురళీకృష్ణపై ఏసీబీకి నటి శ్రీసుధ ఫిర్యాదు

Jul 29 2020 2:01 PM | Updated on Jul 29 2020 2:26 PM

Sri Sudha Complaint To ACB Against SR Nagar CI For Demanding Money - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ఎస్ఆర్ న‌గ‌ర్ సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర లంచం తీసుకున్నారంటూ న‌టి శ్రీసుధ ఏసీబీ(అవినీతి నిరోధ‌క శాఖ‌)కు ఫిర్యాదు చేశారు. కాగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కే.నాయుడు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడ‌ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నటి సాయి సుధ గ‌తంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ద‌ర్యాప్తు కోసం సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు వ‌సూలు చేశా‌రని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక‌ ఈ కేసులో శ్యామ్ కే నాయుడు త‌న‌తో రాజీ కుదుర్చుకున్న‌ట్లు న‌కిలీ ప‌త్రాలు సృ‌ష్టించార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు నాంప‌ల్లిలోని ఏసీబీ అధికారుల‌కు ఆధారాలు స‌మ‌ర్పించారు.  (పెళ్లి పేరుతో మోసం చేశాడు)

చ‌ద‌వండి: (సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement