అత్తపై అల్లుడి దాడి | Son in Law Assult on Aunt in Kurnool | Sakshi
Sakshi News home page

అత్తపై అల్లుడి దాడి

Aug 7 2020 11:23 AM | Updated on Aug 7 2020 11:23 AM

Son in Law Assult on Aunt in Kurnool - Sakshi

గాయపడిన పెద్దక్క   

ఆళ్లగడ్డ రూరల్‌: తన భార్యను కాపురానికి పంపలేదని అల్లుడు అత్తపై వేటకొడవలితో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్‌ సీఐ సుదర్శనప్రసాద్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెద్దక్క కూతురు తులసీని పదేళ్ల క్రితం వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె గ్రామానికి చెందిన హరిఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు.  వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి తాగుడుకు బానిసైన హరిఆంజనేయులు భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు.

ఈక్రమంలో మూడు రోజుల క్రితం తులసీ శుభకార్యం నిమిత్తం(సోదరుడి పెళ్లి) పుట్టినింటికి వచ్చింది. గురువారం భార్యను తీసుకెళ్లేందుకు హరిఆంజనేయులు చింతకొమ్మదిన్నెకు వచ్చాడు. మరో వారం తర్వాత పంపుతానని అత్త చెప్పి పొలానికి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు వెంట వెళ్లాడు ఊరి చివర వేటకొడవలితో అత్త గొంతుపై నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement