బొగ‌తా జ‌ల‌పాతంలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గ‌ల్లంతు | Software Engineer Gone Missing Who Went To Visit Bogota Waterfall | Sakshi
Sakshi News home page

బొగ‌తా జ‌ల‌పాతంలో విషాదం.. టెకీ గ‌ల్లంతు

Aug 31 2020 11:15 AM | Updated on Aug 31 2020 12:22 PM

Software Engineer Gone Missing Who Went To Visit Bogota Waterfall  - Sakshi

సాక్షి, ములుగు :  వాజేడు మండలంలోని బొగ‌త జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గ‌ల్లంత‌య్యారు. వివ‌రాల ప్రకారం హ‌న్మ‌కొండ‌కు చెందిన గోపీనాథ్, హైదరాబాద్‌కు చెందిన తన ఇద్దరు మిత్రులతో కలిసి బొగతజలపాతం సందర్శన కోసం వెళ్లారు. అయితే అక్క‌డ అనుమ‌తి లేక‌పోవ‌డంతో దొడ్డిదారి ద్వారా జ‌ల‌పాతం వ‌ద్ద‌కు చేరుకొని స్నానం చేసేందుకు దిగారు. అనూహ్యంగా వ‌ర‌ద ఉదృతి పెర‌గ‌డంతో గోపీనాథ్ గ‌ల్లంత‌య్యారు. స్నేహితులు అందించిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement