మేనమామ వేధింపులే కారణం..! | Software Employee Commits Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

మేనమామ వేధింపులే కారణం..!

Feb 18 2023 5:07 PM | Updated on Feb 18 2023 6:03 PM

Software Employee Commits Suicide In Nizamabad - Sakshi

నిజామాబాద్ :  మేనమామ వేధింపుల కారణంగానే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అభిజ్ఞగౌడ్‌(23) ఆత్మహత్య చేసుకుంది. తనకు వరుసకు మేనమామ అయిన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం డొంకేశ్వర్‌కు చెందిన సందీప్‌గౌడ్‌ మానసికంగా వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

తాటిపాముల కిరణ్‌ కుమార్‌గౌడ్, స్వప్నల కుమార్తె అభిజ్ఞగౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తు తం ఆమె కామారెడ్డిలో స్థిరపడిన తల్లిదండ్రుల వద్ద ఉంటూ  వర్క్‌ఫ్రం హోమ్‌గా విధులు నిర్వహించేది. అభిజ్ఞ కామారెడ్డి లోని ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మేనమామ మానసిక వేధింపులు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి నుంచి భిక్కనూరుకు శుక్రవారం తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో  అంత్యక్రియలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement