ఆస్తి పంచాయితీ.. సొంత తమ్ముడి హత్యకు రూ.50 వేలు సుపారీ ఇచ్చిన అక్క

Sister Gives Supari Rs 50 Thousand To Eliminate Brother In Karnataka - Sakshi

యశవంతపుర: అక్క సొంత తమ్మున్ని హత్య చేయించిన ఘటన కలబురిగిలో జరిగింది. నగరంలోని గాజీపూర లేఔట్‌కు చెందిన నాగరాజ్‌ మటమారి జులై 28న కలబురిగి నగరం నుండి ఆళంద వెళ్తూ మార్గమధ్యలో కెరెభూసగా గ్రామం వద్ద శవమై తేలాడు. దుండగులు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే ప్రాంతానికి చెందిన అవినాశ్‌ తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆస్తి కలహాలతో నాగరాజ్‌ అక్క సునీత రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయిందని చెప్పాడు. కేసు విచారణలో ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top