దారుణం: తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు 

SI Molestation Harassment On Minor Girl He Arrested At Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తుపాకీ గురిపెట్టి బాలిక(17)పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్‌ఐని, అతనికి సహకరించిన బాలిక తల్లి, పెద్దమ్మను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.  చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్‌లో స్పెషల్‌ టీం ఎస్‌ఐ గా సతీష్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. అతను ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడి రేషన్‌ దుకాణం మహిళా సిబ్బందితో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆమె కుమార్తె (17)పై కన్నేశాడు. ఇందుకు ఆ బాలిక తల్లి, పెద్దమ్మ సహకరించడం మొదలెట్టారు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు ఎస్‌ఐ తుపాకీని సైతం గురిపెట్టాడు.

తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని బెదిరించినా బాలిక చిక్కలేదు. చివరకు తల్లి, పెద్దమ్మ సహకారంతో తనను ఓ ఎస్‌ఐ వేధిస్తున్నట్టు తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. తండ్రి నిస్సహాయుడు కావడంతో తల్లి, పెద్దమ్మ మీద తిరగబడింది. అనంతరం వాట్సాప్‌ ద్వారా పుళల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం గురువారం రాత్రి ఆ బాలిక తల్లి, పెద్దమ్మను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారు ఇచ్చిన వాంగ్మూలంతో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌ విద్య పేరిట విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేకేనగర్‌ పద్మ శేషాద్రి స్కూల్‌ టీచరు రాజగోపాలన్‌పై గుండా చట్టం నమోదుకు కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌ ఆదేశించారు. అలాగే మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన కిషోర్‌ కె స్వామిపైనా గుండా చట్టం నమోదైంది.  

చదవండి: 15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top