శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో దారుణ హత్య | Shiva Reddy Sweet Shop: Workers Fight Each Other One Deceased | Sakshi
Sakshi News home page

శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో దారుణ హత్య

Aug 26 2020 12:01 PM | Updated on Aug 26 2020 2:14 PM

Shiva Reddy Sweet Shop: Workers Fight Each Other One Deceased - Sakshi

ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్‌ శ్రీనివాస్ మొహం తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ మిఠాయి దుకాణం శివారెడ్డి స్వీట్ షాప్‌లో దారుణం చోటుచేసుకుంది. శివారెడ్డి స్వీట్ హౌస్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఓ మహిళ విషయంలో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలైన ఓ వర్కర్‌ మృతి చెందాడు. వివరాలు.. మధురానగర్‌లోని శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో శ్రీనివాస్‌, గౌస్‌ పనిచేస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్‌.. శ్రీనివాస్ మొహం, తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం కొత్త గూడెం జిల్లా రామవరం. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళ వీరి గొడవకు కారణంగా తెలిసింది. ఆమె ముందే జరిగిన ఈ ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఘటనపై ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మహిళపై 12 మంది గ్యాంగ్‌ రేప్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement