Crime Scene Reconstruction At YS Vivekananda Reddy Home - Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకా ఇంటి వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

Sep 15 2021 3:38 AM | Updated on Sep 15 2021 3:22 PM

Scene Reconstruction YS Vivekananda Reddy Home - Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డి (ఫైల్‌ ఫోటో)

పులివెందుల:  మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మంగళవారం పులివెందులలోని వివేకా ఇంటివద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. హత్య జరిగిన రోజున నిందితులు ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఎలా బయటకు వెళ్లారన్న దానిపై రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

వివేకా ఇంటికి నిందితులు బైకుపై రావడం, గేటు తీసి ఇంట్లోకి వెళ్లడం, హత్య జరిగిన విధానం, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు, ఎలా హత్య చేశారు, ఆ తర్వాత ఎలా వెళ్లారు అన్న దానిపై ఆ వ్యక్తుల ద్వారా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తూ వీడియో తీసుకున్నారు.  ఆయుధాలను పట్టణంలోని రోటరీపురం వద్ద ఉన్న వంకలో వేసినట్టుగా అక్కడకు కూడా వెళ్లి రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement