విరిగిన స్టీరింగ్‌ రాడ్‌..  | RTC bus rammed into crop fields | Sakshi
Sakshi News home page

విరిగిన స్టీరింగ్‌ రాడ్‌.. 

Published Mon, Mar 4 2024 1:25 AM | Last Updated on Mon, Mar 4 2024 1:25 AM

RTC bus rammed into crop fields - Sakshi

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 

ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు

చెన్నారావుపేట: వరంగల్‌ జిల్లాలో స్టీరింగ్‌ రాడ్‌ విరగడంతో ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నర్సంపేట డిపో నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మండల పరిధిలోని బోజేర్వు గ్రామానికి వెళ్లింది.

అక్కడి నుంచి 30 మంది ప్రయాణికులతో నర్సంపేటకు వస్తున్న క్రమంలో తిమ్మరాయినిపహాడ్‌ శివారుకు రాగానే బస్సు స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో బురద ఉండటంతో బస్సు కూరుకుపోయి పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement