Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ 

Robbery In Houses At Nandipet In Nizamabad - Sakshi

సాక్షి, నందిపేట్‌(నిజామాబాద్‌): నందిపేట మండలంలోని కుద్వాన్‌పూర్‌ మంగళవారం రాత్రి దొండలు అలజడి సృష్టించారు. ఏకంగా తాళం వేసిన 11 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదు, నగలు, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. కుద్వాన్‌పూర్‌లో పలు కుటుంబాలు తమ బంధువుల ఇళ్లలో శుభకార్యాలు ఉండడంతో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. కాగా మంగళవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

బుధవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి బాధితులకు ఫోన్లలో సమాచారం అందించారు. వారి వచ్చి చూడగా ఇళ్లంతా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి. పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు.   

ట్రాన్స్‌ఫార్మర్ల అపహరణ
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారి పక్కన ఉన్న పంట భూముల్లోని 202, 203 నంబర్లు ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్లను ఎత్తుకెళ్లి వాటి నుంచి కాపర్‌ తీగ, ఆయిల్‌ చోరీ చేశారు. దీంతో బుధవారం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్‌ తీస్తే కొంపలు అంటుకుంటాయ్‌..!?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top