కృష్ణా జిల్లాలో రోడ్డు​ ప్రమాదం.. విషాదం | Road Accident Krishna District Two People Deceased | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు​ ప్రమాదం: ఇద్దరు మృతి

Aug 4 2020 9:20 AM | Updated on Aug 4 2020 10:18 AM

Road Accident Krishna District Two People Deceased - Sakshi

ప్రమాదానికి గురైన కారును వెలికితీస్తున్న దృశ్యం

సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి, చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన తండ్రి కిరణ్‌కుమార్‌, 11నెలల చిన్న కుమారిడిని ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లి మండలం పెనుమాక నుంచి నాగాయలంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిని పెనుమాకకు చెందిన విస్సంశెట్టి దుర్గా మహాలక్ష్మి(32), 6ఏళ్ల పెద్ద కుమారుడు శ్రీమహత్‌గా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement