పుంగునూరులో పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన ఏ-1 నిందితుడు | Pungunur Case A-1 Accused Challa Babu Surrendere | Sakshi
Sakshi News home page

పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన టీడీపీ ఇంచార్జ్‌ చల్లాబాబు

Sep 4 2023 5:40 PM | Updated on Sep 4 2023 9:11 PM

Pungunur Case A-1 Accused Challa Babu Surrendere - Sakshi

చిత్తూరు జిల్లా: పుంగునూరులో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఇంచార్జ్‌ చల్లాబాబు సోమవారం పోలీసులకు లొంగిపోయాడు. పుంగునూరులో పోలీసులపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న చల్లాబాబు నెలరోజుల తర్వాత లొంగిపోయాడు. 

ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్‌ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్‌ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్‌ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్‌ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు.

ఇప్పటివరకూ ఈ దాడి ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

నేరాల్లో ఘనుడు చల్లా బాబు
పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్ర­దా­రి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు అలియాస్‌ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 
1.1985లో రొంపిచెర్ల పోలింగ్‌ స్టేషన్‌పై బాంబు దాడి కేసు
2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రీడ్‌విత్‌ 149 ఐపీసీ, సెక్షన్‌ 3 ఈడీయాక్ట్‌
3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రీడ్‌విత్‌ 34 కింద కేసు
4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు
5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రీడ్‌విత్‌149 కింద సోమల పీఎస్‌లో కేసు
6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రీడ్‌విత్‌ 149 కింద కేసు
7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రీడ్‌విత్‌ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు

చదవండి: పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర

‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement