పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర | Sakshi
Sakshi News home page

పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర

Published Wed, Aug 16 2023 10:02 PM

Chandrababu Conspiracy Revealed In Punganur Riots - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్‌ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్‌కుమార్‌, దూవల అమర్నాథ్‌, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు

ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్‌ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్‌ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్‌ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్‌ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు.
చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్

Advertisement
 
Advertisement
 
Advertisement