పబ్‌ డ్రగ్స్‌ కేసు ఎఫెక్ట్‌: బంజారాహిల్స్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు

Pub Drugs Case Effect: Banjara Hills CI Sivachandra Suspension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ కొత్త సీఐగా నాగేశ్వరరావును నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పబ్‌ కేసులో నిర్లక్ష్యం వహించిన సీఐ శివచంద్రపై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో వైపు ఏసీపీ సుదర్శన్‌కు కూడా ఛార్జిమెమో ఇచ్చారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. కాగా, కొత్తగా నియమితులైన సీఐ నాగేశ్వరరావు డ్రగ్‌ ఆపరేషన్‌లో కీలక పాత్ర వహించారు. పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో టోని అరెస్ట్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ కేసుపై పోలీస్ అధికారులతో  నగర సీపీ సీవీ ఆనంద్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  అత్యవసర సమావేశం నిర్వహించారు.

చదవండి: డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు

బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్‌(కొకైన్‌)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు.

కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప‍్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top