Niharika Konidela: డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు

Sons Of Celebrities On Banjarahills Police Pub Rides - Sakshi

Pudding And Mink Pub Raid: సాక్షి, హైదరాబాద్‌:  బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్‌(కొకైన్‌)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప‍్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు..కాగా, ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు.  మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అర్ధరాత్రి పబ్‌పై దాడులు.. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్‌..

మరోవైపు.. పబ్‌ విషయంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్‌పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే, పబ్‌ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసుల చూడనట్టు వదిలేశారని తెలుస్తోంది.

ఈ కేసులో సీఐ శివచంద్రను సస్పెండ్‌ చేసి ఏసీపీ సుదర్శన్‌కు ఛార్జ్‌ మెమోను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఫుడింగ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ వాడినట్టు తెలిపారు. పబ్‌యాజమాన్యమే డ్రగ్స్‌ సప్లై చేసిందని స్పష్టం చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారిస్తే డ్రగ్స్‌ సప్లై చేసినట్టు అంగీకరించారు. ఆ హోటల్‌లో ఇంకా గాలింపు చర‍్యలు కొనసాగుతున్నాయి. 

పబ్‌ల్లోకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు
డ్రగ్స్‌ కేసులో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. అసలు పబ్‌ల్లోకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనే దానిపై నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ రంగంలోకి దిగింది. వీఐపీలు, వీవీఐపీల పిల్లల తీరుపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. పబ్‌ల్లోకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు. అదే సమయంలో పబ్‌ యాజమాన్యం, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.  డ్రగ్స్‌ సప్లై చేసిన పెడర్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top