Hyderabad: వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం | Prostitution Racket Busted out in Chaitanyapuri Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం

May 10 2022 9:03 AM | Updated on May 10 2022 11:00 AM

Prostitution Racket Busted out in Chaitanyapuri Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై సరూర్‌నగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సాగర్‌ మొండల్‌ అలియాస్‌ రాజు అలియాస్‌ బిల్లు (31), రోహన్‌ మండల్‌ (22) నగరానికి వచ్చి సరూర్‌నగర్‌ అనిల్‌ కుమార్‌ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌లో యువతుల ఫొటోలు పెట్టి కస్టమర్లకు సఫ్లై చేస్తున్నారు.

ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ తమ దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. వీరితో పాటు సహకరిస్తున్న మరో ముగ్గురిని గత డిసెంబర్‌లో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నాగర్‌మండల్‌, రోహన్‌మండల్‌పై రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్‌లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..)

Advertisement
 
Advertisement
Advertisement