అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు!

Police Speaks On Devarakonda Woman Anusha Murder Case - Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష(19) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దర్యప్తులో భాగంగా కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు విష్ణువర్ధన్‌ మృతురాలు అనూషను గత రెండేళ్ళుగా వేధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదట విష్ణువర్ధన్‌, అనూషను పాలపాడు కాలువ వద్దకు మాట్లాడుకుందామని తీసుకేళ్ళాడు. ఇద్దర మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంతో ఊగిపోయిన నిందితుడు అనూషను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహన్ని కాల్వలోకి పడేశాడు. 

కాగా, పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు. ఈఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

చదవండి: 

డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య

ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top