వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం

Police Raids on Brothel Houses Peddapuram - Sakshi

నోటీసులు ఇచ్చి గృహాలు సీజ్‌ చేయాలని ఆర్డీఓ ఆదేశం 

రెవెన్యూ, పోలీసుల సమక్షంలో మూడు ఇళ్లకు తాళాలు 

పెద్దాపురం (కాకినాడ): పట్టణంలో దర్గాసెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో పోలీసులు వ్యభిచార గృహాలపై విస్తృత దాడులు చేశారు. అప్పట్లో కొంతమంది వ్యభిచారులు, విట్‌లను అదుపులోకి తీసుకుని వారి డివిజనల్‌ మెజిస్టేట్‌ పెద్దాపురం ఆర్డీఓ ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆర్డీఓ జేఎస్‌ రామారావు సత్వరమే ఆ గృహాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు.

అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంలో వ్యభిచార నిర్వాహకులైన సిమ్మా సన్యాసిరావు, సిమ్మా బాపనమ్మ, దుక్కా నాగమణిలకు చెందిన గృహాలను సీజ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. సోమవారం ఉదయం పెద్దాపురం తహసీల్దార్‌ జితేంద్ర, సీఐ అబ్దుల్‌ నబీ, ఎస్‌ఐ రావూరి మురళీమోహన్‌ సిబ్బందితో కలిసి వెళ్లి మూడు గృహాలకు తాళాలు వేసి సీల్‌ వేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ నబీ మాట్లాడుతూ వ్యభిచార గృహాలపై దాడులు, సీజింగ్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top