శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్‌ చేసేందుకే ఇచ్చారా?

Police Get Custody Of Shilpa Chowdary And Investigating - Sakshi

మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది.

అయితే ఆమె ఫోన్‌ కాల్‌డాటా, వాట్సాప్‌ చాటింగ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్‌మనీని వైట్‌ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు.  శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top