Sanath Nagar Police Raids On Prostitution House In Secunderabad - Sakshi
Sakshi News home page

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు

Nov 10 2021 12:51 PM | Updated on Nov 10 2021 3:58 PM

Police Attack On Prostitution House In Secunderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సనత్‌నగర్‌(హైదరాబాద్‌): మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై సనత్‌నగర్‌ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో సహా మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఆర్ట్‌ స్పా సెంటర్‌ పేరిట భీమ్‌సింగ్‌ అనే వ్యక్తి మసాజ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

ఈ కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సనత్‌నగర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు భీమ్‌సింగ్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు, ఓ విటుడు, కోల్‌కత్తాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement