ఘోరం : విశ్వాసం లేని కుక్క!... | Pitbull Dog Assassinated Young Girl In Birmingham | Sakshi
Sakshi News home page

ఘోరం : విశ్వాసం లేని కుక్క!...

Feb 7 2021 1:47 PM | Updated on Feb 7 2021 5:24 PM

Pitbull Dog Assassinated Young Girl In Birmingham - Sakshi

మృతురాలు కైరా

కైరా ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఆమె తన గదిలోని బెడ్‌పై నిద్రపోతున్న సమయంలో...

లండన్‌ : విశ్వాసం లేని ఓ పెంపుడు కుక్క తన యజమానిని దారుణంగా కొరికి చంపేసింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్మింగ్‌హామ్‌లోని కిట్స్‌ గ్రీన్‌ ఏరియాకు చెందిన కైరా లాడ్లో కుటుంబం ఓ పిట్‌బుల్‌ డాగ్‌ను పెంచుకుంటోంది. శుక్రవారం కైరా ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఆమె తన గదిలోని బెడ్‌పై నిద్రపోతున్న సమయంలో పిట్‌బుల్‌ దాడి చేసింది. ఆమె చేతిని కొరికి, చీల్చిపడేసింది. ప్రాణాల కోసం ఆమె ఎంత అరుస్తున్నా అది విడిచిపెట్టలేదు. ఆ అరుపులు విన్న పొరుగింటి వారికి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? )

కైరా పెంపుడు పిట్‌బుల్‌డాగ్‌

కైరాకు ఫోన్‌ చేసిన ఆమె బంధువు ఒకరు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో పడి ఉన్న ఆమెను గుర్తించారు. కైరాను పరీక్షించి చనిపోయినట్లుగా తేల్చారు. సంఘటనా స్థలంలో ఉన్న పిట్‌బుల్‌ డాగ్‌ కారణంగా ఆమె మరణించిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement