బట్టలు విప్పి వీడియో తీశారు.. జోగిని శ్యామలపై కేసు!

Panjagutta: Zero FIR Registered Against Jogini Shyamala - Sakshi

సాక్షి, పంజగుట్ట: జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదయ్యింది. అనంతరం సదరు కేసును మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాందీనగర్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్‌పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది.

అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను కలిసింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్‌ ఉమ ఉంది.

ఈ క్రమంలో వారు మద్యం తాగుతుండగా యువతిని కూడా మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. తాను దానికి ఒప్పుకోలేదని, దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది. బాధితురాలు డ్రైవర్‌ సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని 13వ తేదీ నగరానికి చేరుకున్నట్లు, గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసి పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. 

చదవండి: 
డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్‌ హత్య
ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top