Hyderabad: నేనేమి చేశాను నేరం! | Newborn Baby Girl Found Dead At Uppal | Sakshi
Sakshi News home page

Hyderabad: నేనేమి చేశాను నేరం!

Oct 24 2022 2:19 PM | Updated on Oct 24 2022 2:19 PM

Newborn Baby Girl Found Dead At Uppal - Sakshi

సాక్షి, ఉప్పల్‌: నెలన్నర వయస్సున్న ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలేసిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పల్‌ హెచ్‌ఎండీఎ లే అవుట్‌ భగాయత్‌ లేఅవుట్‌ డీమార్టు వద్ద చెట్ల పొదల్లో ఆదివారం ఓ చిన్నారిని గుర్తించిన వాకర్స్‌ 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టంనిమిత్తం గాం«దీకి తరలించారు. అయితే.. చనిపోయిన శిశువును వదిలేసి వెళ్లారా.. లేక బతికి ఉండగానే వదిలేసి వెళ్లారా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

  

Advertisement
 
Advertisement
Advertisement