న్యూ ఇయర్ రోజున విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..

New Year Tragedy Kerala Tour Bus Accident Many Students Injured - Sakshi

తిరువనంతపురం: నూతన సంవత్సరం వేళ కేరళ మలప్పురంలోని తిరూర్‌లో  విషాదం జరిగింది. టూర్‌కు వెళ్లి తిరిగివస్తున్న బస్సు ‍అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం 1:15 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 40 మంది గాయపడ్డారు.

అయితే కొండ ప్రాంతంలో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్‌కు  లేకపోవడం కారణంగా బస్సు నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణం కూడా సరైన ప్లాన్ లేకుండా జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది.
చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top