హై ప్రొఫైల్ వ్యభిచారం.. పోలీసులు పక్కా ప్లాన్‌ వేసి.. ఇన్‌ఫార్మర్‌ని హోటల్‌కి పంపించి..

New Delhi: High Profile Prostitution Racket Busted Police - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ స‌మీపంలోని హోట‌ల్స్‌లో గుట్టుచ‌ప్పుడు కాకుండా నిర్వ‌హిస్తున్న వ్యభిచార దందాను ఢిల్లీ పోలీసులు (ఐజీఐ) చేధించారు. ఈ ఘటనలో.. దందా నడిపిస్తున్న సూత్రధారి, ఒక అమ్మాయితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో హైప్రోఫైల్ వ్యభిచార రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంపై దాడులు చేసేందుకు పోలీసు అధికారులు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. ఈ దందా నడుపుతున్న వ్యక్తి దగ్గరకు పోలీసులు తమ రహస్య ఇన్‌ఫార్మర్ ద్వారా సంప్రదించారు.

ప్లాన్‌ ప్రకారం హోటల్ హాలిడే ఇన్‌లో ఒక గదిని కూడా బుక్ చేశారు. ఇన్‌ఫార్మర్‌ వేచి ఉన్న హోటల్‌కు సూత్రధారి ఓ అమ్మాయిని తీసుకుని వచ్చి హోటల్ వరండాలో దించి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత హోటల్‌లో గదికి యువతి చేరుకోగానే డెకాయ్ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆ పరిసరాల్లోనే ఉన్న బృందం యువతిని, ఆమెను డ్రాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి నవీన్‌గా గర్తించారు. అతనిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

చదవండి: భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో...

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top