పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ | Nalgonda: Police Filed A Case On Marriage Reception Persons | Sakshi
Sakshi News home page

పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ

May 22 2021 9:26 AM | Updated on May 22 2021 9:41 AM

Nalgonda: Police Filed A Case On Marriage Reception Persons - Sakshi

కరోనా విజృంభిస్తున్నా ప్రజలు యథేచ్ఛగా విందులు, వేడుకలు చేసుకుంటున్నారు. వివాహ రిసెప్షన్‌ జరుగుతుండగా పోలీసులు  ఎంట్రీ ఇచ్చారు.

నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కర్ఫ్యూ అమలును ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. టూటౌన్‌ పరిధిలో 20మందికి మించి వివాహ రిసెప్షన్‌ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. రిసెప్షన్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని టూటౌన్‌ పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు.

చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
చదవండి: చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు

Advertisement
 
Advertisement
Advertisement