
పల్లవి (ఫైల్)
యశవంతపుర (కర్ణాటక): బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. మండ్యకు చెందిన సంతోశ్, పల్లవిలు ఇక్కడి సుద్దగుంటె పాళ్యంలో నివాసం ఉంటున్నారు. పల్లవికి నెలలు నిండాకుండానే కాన్పు జరిగింది. ఆరు నెలలకే పుట్టిన బిడ్డ సోమవారం మరణించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.