ప్రియుని ఇంట్లో కన్న కొడుకు హత్య.. ఆరు నెలలు గడిచిన తర్వాత.. | Mother Boyfriend Killed 10 Years Old Boy Bangalore | Sakshi
Sakshi News home page

ప్రియుని ఇంట్లో కన్న కొడుకు హత్య.. ఆరు నెలలు గడిచిన తర్వాత..

Sep 12 2021 7:53 AM | Updated on Sep 12 2021 3:35 PM

Mother Boyfriend Killed 10 Years Old Boy Bangalore - Sakshi

శివాజీనగర: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కొడుకు.. ప్రియుని చేతిలో హత్యకు గురికాగా,  ఆరు నెలల తరువాత తల్లి ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నిందితులు నిజం కక్కారు. నగరంలోని మైకో లేఔట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివరాలు... ఓ యువతికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె తన ప్రియుని ఇంట్లో ఆ కుమారున్ని ఉంచింది. ఫిబ్రవరి 7న సదరు వ్యక్తి తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని బాలున్ని కొట్టిచంపాడు. ఆ వెంటనే తన రెండో ప్రియురాలితో బాలుని తల్లికి ఫోన్‌ చేయించి పిలిపించారు. హత్య విషయం ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. అనంతరం ప్రియుడు, తన రెండవ ప్రియురాలితో కలిసి ఓ కారులో తమిళనాడులోని బర్గూరు వద్ద ఓ నిర్జన ప్రదేశంలో పడేసి వచ్చారు.

బాలుడు కనిపించపోవడంతో బంధువులు ఒత్తిడి చేయడంతో సదరు మహిళ తన కుమారుడు కనిపించలేదని ఆగస్టు 25న మైకో లేఔట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు వీరిపై నిఘా పెట్టి  విచారణ చేయగా అసలు విషయం వెల్లడించారు. దీంతో పోలీసులు బాలుని తల్లితో పాటు ప్రియుడు, ఇతనికి సహకరించిన మరో ప్రియురాలిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement